ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మోకాళ్లపై తిరుమల కొండెక్కిన టీడీపీ అభిమాని- ఎన్నికల్లో గెలవాలని స్వామి వారికి మొక్కులు - TDP Follower in Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 4:12 PM IST

TDP Follower in Tirumala : రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ తిరుపతికి చెందిన శ్రీనివాసులు మోకాళ్ల పై నడుచుకుంటూ తిరుమలకు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అలిపిరి మెట్ల మార్గం వద్దకు వెళ్లి శ్రీనివాసులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వీరాభిమానులను సంపాదించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని తెలిపారు. మీఅందరి ఆశీస్సులతో తన తండ్రి భారీ మెజారిటీతో  గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్​ ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని. ఇక నైనా ప్రజలందరూ అభివృద్ది చేసేవారిని గెలిపించాలని శ్రీనివాసులు కోరారు. 

రాష్ట్ర అభివృద్ధి విజన్ కలిగిన చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేస్తూ వారికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని భక్తుడు శ్రీనివాసులు తెలిపారు. అలా జరగకూడదనే ముందుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుని మోకాళ్లపై  అలిపిరి నుంచి తిరుమలకు వెళుతున్నట్లు శ్రీనివాసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details