ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం అర్బన్‌ టీడీపీలో ఆందోళన- ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై అనుచరులు ఆగ్రహం - TDP faces dissidence in Anantapur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 8:06 PM IST

tdp_faces_dissidence_in_anantapur

TDP faces dissidence in Anantapur : అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం (Telugudesam) జిల్లా కార్యాలయానికి వెళ్లి తాళం పగులగొట్టి ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ప్రచార సామగ్రికి నిప్పుపెట్టారు. స్థానికంగా వీరంగం సృష్టించారు. పొరుగు జిల్లాలకు వెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయమని, అలాంటి తనకు టికెట్‌ ఇవ్వకపోవడం దారుణమని ప్రభాకర్‌ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

EX MLA Prabhakar chowdary Dissent in Telugu desam party : ఎన్నికలు (Elections) దగ్గర పడుతున్నా కొద్దీ అన్ని పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అభ్యర్థుల జాబితాలు విడుదలవుతున్నా కొద్ది పలు పార్టీ వర్గీయుల మధ్య వాగ్వాదాలు సర్వ సాధారణమయ్యాయి. అదే తరహాలో అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి (Prabhakar Choudary) అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక రాజకీయంలో ఎటువంటి మలుపు జరగనుందని ప్రజలు వేచిచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details