ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: ఏలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam SABHA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 2:05 PM IST

Updated : May 10, 2024, 2:45 PM IST

TDP Chief Chandrababu Prajagalam Public Meeting Live: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నరకానికి నకళ్లుగా మారిన రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని వాగ్దానం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తామన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగానికి తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, అన్ని వర్గాల ఆకాంక్షల్నీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. జగన్‌ ఈ రాష్ట్రానికి పట్టిన ప్రమాదకరమైన వైరస్‌ అని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఓటు అనే వ్యాక్సిన్‌తో ఆ వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్‌ అరాచక పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated : May 10, 2024, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details