ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్వాడీల సమ్మె కాలానికి వేతానాలు చెల్లింపునకు ఉత్తర్వులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 1:51 PM IST

Sub-Committee_Consisting_With_Anganwadi_Workers

Sub-Committee Consisting With Anganwadi Workers: వైఎస్సార్సీపీ ప్రభుత్వ గడువు మరో రోజులో ముగిసిపోనుండగా జగన్ సర్కార్ మరో ఎన్నికల ఎత్తు గడకు తెరతీసింది. తెలంగాణ తరహాలో గౌరవ వేతనం పెంచాలని కోరుతూ రోడ్డెక్కి నెత్తి నోరు బాదుకుంటూ 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తే ఆ డిమాండ్లను తీర్చకుండానే విధుల నుంచి తొలగిస్తా మనే కత్తి వారి మెడ మీద పెట్టి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం విరమింపచేసింది. ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తూతూమంత్రపు మాటలు చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ తర్వాత నెల రోజులు కిమ్మనకుండా ఉండి, ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీకి చైర్మన్​గా మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆంగన్వాడీల నియామకాలు (Appointments), పదోన్నతులు (Promotions), బదిలీలు, క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధానం, తదితర వాటిని పరిశీలించనుంది. దీనితో పాటు అంగన్వాడీలు చేపట్టిన 42 రోజుల సమ్మె కాలాన్ని వేతనాలు చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details