ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డెడ్ స్టోరేజ్​కు చేరిన శ్రీశైల జలాశయం - Srisailam water Dead Storage

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 10:42 PM IST

Srisailam Water Level Reached Dead Storage : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నిలువలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రజలకు సాగు మరియు త్రాగునీటి అవసరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పాడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్​కు చేరుకున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810 అడుగులకు చేరుకుంది. 

Srisailam Reservoir : అలాగే శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 34 టీఎంసీలకు పడిపోయింది. ముచ్చుమర్రి ఎత్తిపోతల వల్ల హంద్రీనీవాకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో రాష్ట్రానికి చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే గత ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు 18 వరకు 129 టీఎంసీల నీరు మాత్రమే డ్యామ్‌లోకి చేరింది. ఈ కారణంగా గత ఏడాది ఒక్క గేటు కూడా ఎత్తే పరిస్థితి రాలేదు. ఇలాంటి పరిస్థితే  2002-03, 2003-04, 2015-16 సంవత్సరాలలోను ఉత్పన్నమైంది.

ABOUT THE AUTHOR

...view details