ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగోడి గుండె రగిలేలా- 'చిన్నమ్మ' పాట విన్నారా! - Song Release for Purandeswari

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 1:56 PM IST

Updated : May 1, 2024, 7:17 PM IST

purandeswari

Song Release for BJP Chief Purandeswari: 'ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకుని చూస్తుందో' అంటూ మొదలైన ఆ పాట నేడు యావత్ రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. 'ఏ పాదమైతే ఈ నేలపైన దైవాల రూపమై నిలిచిందో' అంటూ ఊరూ, వాడా మార్మోగుతోంది. 'రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన నేతలపైన యుద్ధమే మొదలెట్టింది చిన్నమ్మే' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఆ పార్టీ నేతలు అదిరిపోయే సాంగ్ రిలీజ్​ చేశారు. అన్న ఎన్టీఆర్​ను కీర్తిస్తూ, ఆయన ఆశయాలు నెరవేర్చే వారసురాలిగా చిన్నమ్మ అంటూ ఈ పాట సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

ప్రేమను పంచే చిన్నమ్మే ప్రజలలోకి వచ్చిందని, తెలుగు తల్లి గుండెమంటై వైఎస్సార్సీపీ పాలనపై పురందేశ్వరి నిప్పులు చెరుగుతోందంటూ స్పష్టంగా వివరించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన జగన్ పాలనపై యుద్ధం మొదలుపెట్టింది చిన్నమ్మ అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో కల్తీ మద్యం అమ్మకాలు, పోలవరం నిర్మాణంపై ఆమె చేస్తున్న పోరాటంపై సైతం వివరించారు. రాష్ట్రంలో చీకట్లను తొలగించి వెలుగులు నింపేందుకు వచ్చిన పురందేశ్వరి పోరాటం వెనుక తండ్రిలా ప్రధాని మోదీ, అండగా చంద్రబాబు, అందరివాడిలా పవన్ కల్యాణ్ తోడున్నారంటూ అద్భుతంగా వర్ణించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రుల ఆశలు తీర్చగా వచ్చిన తారక రాముని బాణం పురందేశ్వరికి ఓట్లు వేసి ఎంపీగా గెలిపించాలని పాట రూపంలో పిలుపునిచ్చారు.

Last Updated : May 1, 2024, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details