ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచలంలో ఘనంగా శివపార్వతుల వసంతోత్సవాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 7:39 PM IST

Shiva Parvati Kalyanam in simhadri Andhra Pradesh : వరహా లక్ష్మీ నరసింహ స్వామి (Narasimha Swami) వారి దేవస్థానం క్షేత్రపాలకుడైన శ్రీ త్రిపురాంతక స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్​మూర్తి, అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం వసంతోత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యాహ వచనము, మండపారాధన, పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమం అనంతరం స్వామివారికి నాదస్వర వేదమంత్రాలతో తిరువీధి కార్యక్రమం నిర్వహించారు. తదుపరి గంగ ధార వద్దకు శివపార్వతులను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ వసంతోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.    

Simhachalam Temple Visakhapatnam :  భక్తుల (Devotees) సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని సదుపాయాలు చేశారు. స్వామి వారి సేవలో భక్తులు పాల్గొన్నారు. దైవ నామ స్మరణతో దేవాలయ (Temple) పరిసరాలు మార్మోగాయి. శివపార్వతుల వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details