తెలంగాణ

telangana

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్​ ఇంజిన్​లో మంటలు - క్షణాల్లో పూర్తిగా దగ్ధమైన వాహనం

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 8:40 PM IST

Royal Enfield bike fire accident in Jangaon : ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఇంజిన్​లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన జనగామ పట్టణంలో చోటుచేసుకుంది. లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ధీకొండ నాగరాజు అనే యువకుడు గత 2 నెలల క్రితం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield)వాహనాన్ని కొనుగోలు చేశాడు. నేడు జనగామ పట్టణంలోని హెచ్​పీ పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం టైర్లలో గాలి నింపుతుండగా ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి.

ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేసరికి నిమిషాల్లో వాహనం పూర్తిగా దగ్ధం అయింది. 2 నెలల క్రితమే ఇష్టపడి కొన్న బండి కళ్ల ముందే దహనం అవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో నాగరాజు బోరున విలపించాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పిన తరువాత వాహనాన్ని ఆటోలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షో రూమ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details