ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టైరు పేలి బొలెరో వాహనం బోల్తా - 17 మంది కూలీలకు గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 12:02 PM IST

Road_Accident_Several_Injured

Road Accident Several Injured: అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా (Bolero Overturned) పడి 17 మంది గాయాపడ్డారు. అరటి గెలలను కొట్టడానికి పశ్చిమబంగ (West Bengal)కు చెందిన కూలీలు వలస వచ్చారు. కూలీలు వివిధ ప్రాంతాల్లో రోజూ అరిటి గెలలు కొట్టి లారీల (Lorries)కు లోడ్ చేసేవారు. ఈ క్రమంలో 17 మంది కూలీలను తరలిస్తున్న బొలేరో వాహనం తాడిపత్రి-గుత్తి జాతీయ రహదారి (Tadipatri-Gooty National Highway)పై వెళ్తుండగా టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

Anantapur District Road Accident: ఈ ప్రమాదంలో 17 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి (Tadipatri Government Hospital)కి తీసుకెళ్లగా ఆరుగురి పరిస్థితి విషమించడంతో అనంతపురం సర్వజనాసుపత్రి (Anantapur Sarvajanasupatri)కి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ (Driver) రాఘవ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details