ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 3:16 PM IST

Road Accident in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రైతు రామన్న (40) వ్యక్తిగత పని మీద స్థానిక పట్టణానికి వచ్చి బుధవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఉరవకొండ వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనం పట్టణ శివారు జాతీయ రహదారిలో అతని వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య వరలక్ష్మి, కొడుకు సాయి ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

Accident Due to Collision of Two Bikes : ఇదే ప్రమాదంలో మరో ద్విచక్ర వాహనదారుడు కోనాపురానికి చెందిన వంశీ తీవ్రంగా గాయపడగా చికిత్సకు అనంతపురం తరలించారు. వంశీ మద్యం తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు అతన్ని చికిత్సకు తరలించకుండా రామన్న బంధువులు ఆందోళనకు దిగారు. సీఐ తిమ్మయ్య నచ్చచెప్పడంతో వారు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details