ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ట్రెండింగ్​లో #ResignJagan - పింఛన్ లబ్ధిదారుల ఇబ్బందులు తెలిపేలా నెటిజన్లు ట్వీట్లు - Resign Jagan Trending in Twitter

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 5:36 PM IST

Resign Jagan Hashtag Trending 2nd Place in Twitter: రిజైన్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ (#ResignJagan) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్విట్టర్​లో 2వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. పెన్షన్ల కోసం లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను అందరికీ తెలిసేలా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పింఛన్ల పంపిణీ అనే ప్రభుత్వ సామాజిక బాధ్యతని విస్మరించిన సైకో జగన్ రాజీనామా చేయాలంటూ వేల సంఖ్యలో ట్విట్టర్​లో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. 

అవ్వా తాతలకు మద్దతుగా ట్విట్టర్​లో నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. అవ్వా తాతల పింఛన్ల విషయంలో ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్​లో రిజైన్​ జగన్​ అనే హ్యష్​ ట్యాగ్​ను (Resign Jagan Hashtag Trending) షేర్​ చేయడంతో అది కాస్త సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details