ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంజిన్​లో చెలరేగిన మంటలు - ప్రైవేటు ట్రావెల్​ బస్సు దగ్ధం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 12:00 PM IST

bus_accident

Private Travel Bus Fire Accident in Guntur District : ఇంజిన్​లో మంటలు చెలరేగి ఓ ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన  స్లీపర్ బస్సు దగ్ధమైన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అంకిరెడ్డిపాలెం సమీపంలోని అకస్మాత్తుగా ట్రావెల్​ బస్సులో మంటలు చెలరేగి కాలిపోయింది. విజయవాడకు చెందిన జీవీఆర్​ ట్రావెల్స్​ బస్సు 30 మందితో గురువారం రాత్రి విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. గుంటూరు దాటిన తర్వాత అంకిరెడ్డి పాలెం వద్దకు వచ్చే సరికి ఇంజిన్​లో మంటలు చేలరేగాయి. 

Ankireddypalem National High Way : బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్​ వాహనాన్ని అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారి పక్కగా నిలిపివేశారు. బస్సు డ్రైవర్​ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకి దింపివేశారు. అనంతరం ఒక్కసారిగా మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగిసి పడుతున్నా మంటలను ఆర్పివేశారు.

ABOUT THE AUTHOR

...view details