ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ విధ్వంస పాలనపై ఛార్జ్​షీట్ విడుదల చేస్తాం: టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ - nda release chargesheet on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:42 PM IST

NDA Release Charge Sheet on Jagan : ముఖ్యమంత్రి జగన్ అరాచకాలు, విధ్వంసాలపై కూటమి ఛార్జ్​షీట్ విడుదల చేస్తున్నట్లు కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మీడియా సమావేశంలో పాల్గొన్న వెంకటప్రసాద్ జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైందని, జగన్ అరాచకాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షపార్టీలపై దాడులకు పాల్పడుతూ అరాచకాలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం ఇస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతామని హామీ ఇచ్చిన జగన్ పదవి వచ్చిన తరువాత విస్మరించారని మండిపడ్డారు. జగన్ సంక్షేమం జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వెంకటప్రసాద్ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన దౌర్జన్యాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఓటర్లకు వచ్చిందని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్​లో కూటమి అభ్యర్థులను గెలిపించి జగన్​ను ఇంటికి పంపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details