ఆంధ్రప్రదేశ్

andhra pradesh

షర్మిల వ్యవహార శైలి చూస్తుంటే జాలి వేస్తోంది: మంత్రి బొత్స

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 7:48 PM IST

Minister_Botsa_Satyanarayana_on_AP_Congress_Chief_YS_Sharmila

Minister Botsa Satyanarayana on AP Congress Chief YS Sharmila: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఏపీసీసీ చీఫ్​గా షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సోదరుడు జగన్​, వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మర్చిపోయాడని జగన్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో షర్మిలపై వైఎస్సార్సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. షర్మిల మాట వ్యవహార శైలి చూస్తుంటే జాలి వేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

జనవరి 27వ తేదీన భీమిలిలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి సభకు శ్రీకాకుళం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డితో కలిసి బొత్స పాల్గొన్నారు. వైఎస్సార్సీపీపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు షర్మిల మాట్లాడుతోందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని కలుస్తున్నారన్న బొత్స, జగన్మోహన్ రెడ్డి కలిస్తే తప్పు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

Botsa on Ganta Srinivasa Rao Resignation approval: గంటా శ్రీనివాసరావు సభాపతి తమ్మినేనిని సీతారాంను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారన్న బొత్స, స్పీకర్​కు ఇప్పుడు సమయం దొరకడంతో రాజీనామాను ఆమోదించారని అన్నారు. ఈ క్రమంలో 'రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిదో మీరే చూస్తారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details