ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆసరా సమావేశానికి హజరు కావాల్సిందేనంటూ అధికార పార్టీ జులూం- తీవ్రంగా అవస్థలు పడ్డ మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:40 PM IST

asara_program

MEPMA Staffing Difficulties to Support for Asara Programme : ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో మహిళలను బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు మెప్మా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. డ్వాక్రా మహిళలకు నాలుగో విడత ఆసరా నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలను బలవంతంగా తీసుకువచ్చారు. కొద్ది సేపు మీటింగ్​లో కూర్చున్న మహిళలకు సరైన సౌకర్యాలు లేక ఇంటి బాట పట్టారు.

డ్వాక్రా మహిళలకు ఆసరా నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని మహిళలను ఇంటికి వెళ్లకుండా నిలువరించారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఉండమని మెప్మా సిబ్బంది మహిళలను కోరారు. మహిళలు మెప్మా సిబ్బంది మాటలను లెక్కచేయకుండా బయటకు వెళ్తుతున్నారు. దీంతో మెప్మా సిబ్బంది మహిళలు వెళ్లకుండా గేట్లు మూసేశారు. సమావేశం ఇంకా ఆలస్యం కావడంతో మెప్మా సిబ్బందితో మహిళలు గొడవపడి మరీ బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉన్న కొద్ది మందితోనే ఆసరా నగదు చెక్కుల కార్యక్రమాన్ని కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details