ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పుట్టినరోజు వేడుకల పేరుతో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి హంగామా- స్వామిభక్తి చాటుకున్న వీసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 7:18 PM IST

Chalamalasetty Sunil birthday celebration: కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమశెట్టి సునీల్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో నగరప్రజలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలు దారిమళ్లించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ వీసీ మరోసారి స్వామి భక్తిని చాటుకున్నారు. జేఎన్‌టీయూ ప్రాంగణంలో వేడుకలకు వచ్చిన వారి ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులకు పార్కింగ్‌కు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో జేఎన్​టీయూ ప్రాంగణంలో  వైఎస్సార్సీపీ జెండాలతో హడావిడి కనిపించింది. 

చలమశెట్టి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల చర్యలతో  విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. జేఎన్‌టీయూ రహదారి పొడవునా సనీల్ బ్యానర్‌లు తప్పా ఇంకోకటి కనిపంచరాదు అన్నట్లు వ్యవహరించారు. టీడీపీ, జనసేన జండాలను, బ్యానర్‌లను తొలగిస్తూ వాహనంలో పడేసి తోలుకుపోయారు. సునీల్ బ్యానర్‌కు అడ్డుగా ఉందని ప్రధాని మోదీ బ్యానర్ సైతం పీకేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుట్టినరోజు వేడుకల నెపంతో వైఎస్సార్సీపీ  విందు రాజకీయాలు మొదలెట్టేసింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సామ దాన దండోపాయాలతో ఎన్నికలకు వెళ్తుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details