ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తమ సొమ్మను ప్రభుత్వమే చెల్లించాలి- జయలక్ష్మీ కో ఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ దారుల డిమాండ్ - Jayalakshmi Depositors Demonds

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:51 PM IST

Jayalakshmi Co- operative Society Depositors Demonds kakinada District : కాకినాడ జిల్లాలో జయలక్ష్మీ కో ఆపరేటివ్ సోసైటీలో డిపాజిట్ దారులు తమకు రావలసిన డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ (Demond) చేశారు. 20 వేల మంది చందా దారులు 540 కోట్ల రూపాయిలను సోసైటీలో దాచుకున్నామని బాధితులు వాపోయారు. వైసీపీ హయాంలోనే సొసైటీ నిర్వాహకులు బ్యాంకు డిపాజిట్లను లోన్స్ రూపంలో ఇచ్చేశారని ఆరోపించారు. రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతోనే తమ డిపాజిట్లు గల్లంతు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తమ సమస్యను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (MLA Dwarampoodi Chandrashekar reddy), మిథున్ రెడ్డి సహా సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళ్లినప్పటికి న్యాయం (Justice) జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jayalakshmi Co- operative Bank Scam in Kakinda : పేద మద్యతరగతి వారందరం రూపాయి రూపాయి పోగేసుకుని దాచుకుని డిపాజిట్ చేస్తే నిండా ముంచారని కన్నీటి పర్యాంతమవుతున్నారు. తమకు న్యాయం చేస్తామని భరోసా కల్పించే పార్టీకి రానున్న ఎన్నికల్లో (Elections) తామంతా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details