ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : నాదెండ్ల మనోహర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 10:07 PM IST

Janasena Nadendla Manohar Fires on YSRCP Govt: 1400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర ప్రజలకు సురక్షిత తాగునీరు అందించలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. డయేరియా లక్షణాలతో బాధపడుతూ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న రోగులను మనోహర్ పరామర్శించారు. ఇప్పటి వరకూ 200 మంది డయేరియాతో జీజీహెచ్​కు రాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఎంతో గొప్పగా చెప్పుకునే గుంటూరు నగరంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణమని అన్నారు. 

వైసీపీ అయిదేళ్ల కాలంలో ప్రణాళిక ప్రకారం తాగునీటిని అందించలేకపోయారన్న మనోహర్, ముగ్గురు మృతి చెందినా యుద్ద ప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకుని మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సైతం చొరవ చూపించాలని, ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ డయేరియా కేసులకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలన్న మనోహర్, రోగులకు జనసేన తరపున తమ వంతు సాయం అందిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details