ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రాన్ని దొంగ ఓట్ల రాజ్యంగా మార్చిన జగన్​ - దేశ ద్రోహంగా పరిగణించాలి : TNSF

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 4:53 PM IST

fake_votes

Jagan has Turned the State into a Kingdom of Stolen Votes : ముఖ్యమంత్రి జగన్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం దొంగ ఓట్ల రాజ్యంగా మారిందని తెలుగు యువత నేత రవి నాయుడు ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగించాలంటూ తెలుగు యువత నాయకులు తిరుపతిలో ఆందోళన చేశారు. కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని దొంగ ఓట్ల జాబితాను గాంధీజీ విగ్రహం వద్ద పెట్టి నిరసన తెలిపారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దొంగ ఓట్ల నమోదుకు పాల్పడ్డారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రగిరి నియోజక వర్గంలోనే లక్షలకు పైగా దొంగ ఓట్లు ఎక్కించారని తెలుగు యువత నేత రవి నాయుడు ఆరోపించారు. ఇక తిరుపతిలో 40 వేలకు పైగా దొంగ ఓటర్లు ఎక్కించారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాన్ని అందజేసిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని మండిపడ్డారు. దొంగ ఓట్ల చేర్పును దేశ ద్రోహంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లను తొలగించే వరకు కొత్త ఓటరు జాబితాను విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details