ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హథీరాం భూముల ఆక్రమణలో కీలక నేత - సాక్ష్యాలు సేకరిస్తున్న వారిపై దాడి - HATHIRAMJI MUTT RESPONSE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:46 PM IST

Hathiranji_Mutt_Fit_Person_Respond_on_Eenadu_Etv_News

Hathiramji Mutt Fit Person Respond on Eenadu Etv News: తిరుపతి నగరంలోని ఎంఆర్ పల్లి పోలీస్‍ స్టేషన్‍ సమీపంలో హథీరాం మఠం భూముల ఆక్రమణపై ఈనాడు - ఈటీవీ కథనాలకు మఠం అధికారులు స్పందించారు. హథీరాంజీ మఠం ఫిట్‍ పర్సన్‍ రమేష్‍ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మఠం భూములను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నవీన్‍ అనే వ్యక్తి భూ ఆక్రమణలో కీలక సూత్రధారిగా గుర్తించామన్నారు. కోర్టు స్టే ఉన్నా నిర్మాణాలు చేపట్టిన తీరుపై సాక్ష్యాలు సమర్పించేందుకు ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా తమ సిబ్బందిపై నవీన్​ దాడికి పాల్పడ్డారని వివరించారు. దాడికి గురైన తమ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడటంతో దేవాదాయ శాఖ కమీషనర్‍ ద్వారా తిరుపతి కలెక్టర్‍, ఎస్పీల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు మఠం భూములు ఆక్రమించిన నవీన్​పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈరోజు కథనం: తిరుపతిలో హథీరాం జీ మఠానికి చెందిన వందల ఎకరాలు వైఎస్సార్సీపీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. అధికార పార్టీ అంటే చెవి కోసుకుంటా అనేలా హడావిడి చేసే ఓ కీలక నేత ఆధ్వర్యంలో మఠం భూముల ఆక్రమణ తారస్థాయికి చేరింది. హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా మఠం భూముల్లో నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details