తెలంగాణ

telangana

ప్రాణిహత చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్​రావు, భట్టి మధ్య డైలాగ్​ వార్​

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 2:32 PM IST

Harish Rao VS Bhatti Vikramarka in Assembly

Harish Rao VS Bhatti Vikramarka in Assembly : నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాణిహత చేవెళ్ల ప్రాజెక్టుకు మొబిలైజేషన్‌, సర్వేల పేరుతో వ్యయం చేశారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. ప్రాణహిత-చేవెళ్లకు 8 ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదంటూ ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదంటూ గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.  

War Of Words on Pranahita-Chevella Project : మరో రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేదని హరీశ్‌రావు అన్నారు. కేవలం రూ.28 వేల కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాదని, కాళేశ్వరం పేరిట రీడిజైన్‌ చేసి లక్షా 47 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ భట్టి విక్రమార్క ఎదురుదాడికి దిగారు. ప్రాణహిత 152 మీటర్లకు డిజైన్‌ చేయడంపై అభ్యంతరం ఉందని మహారాష్ట్ర సీఎం లేఖ రాసినట్లు గుర్తు చేశారు. మహారాష్ట్రతో చర్చించి 148 మీటర్లకు ఒప్పించి ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details