ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా' - గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్‌తో ముఖాముఖి - yarlagadda venkata rao interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:48 PM IST

Gannavaram TDP Candidate Interview: విజ్ఞులైన గన్నవరం ప్రజలు చంద్రబాబు కన్నీటికి కారణమైన వ్యక్తికి ఎన్నికల్లో ఖచ్చితంగా సమాధానం చెప్తారని తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkata Rao) స్పష్టం చేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థికి విజయం అందించిన చరిత్ర గన్నవరానికి ఉందన్న ఆయన, ఈసారి ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని యార్లగడ్డ మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వైఎస్సార్సీపీ మోసం చేసిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు. తనను గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తాను రాజకీయం చేయటానికే వచ్చా తప్ప రౌడీయిజం చేయటానికి గన్నవరం రాలేదంటున్న తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details