ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంగవరం పోర్టు కార్మికుల సమ్మె - విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిపై ప్రభావం - Visakha Steel Plant production

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 1:07 PM IST

Visakha Steel Plant Production Situation

Visakha Steel Plant Production Situation : గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై పడింది. జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ 9 రోజులుగా కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీంతో పోర్టులో కార్యకలాపాలు స్తంభించాయి. ప్లాంటుకు అవసరమైన బొగ్గు నిల్వలు పోర్టులో ఉండిపోవడంతో ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. 

Workers Strike in Gangavaram Port for 9 Days : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. గంగవరం పోర్టులో 9 రోజులుగా కార్మికుల సమ్మె కారణంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన బొగ్గు నిల్వలు ఆగిపోయాయి. గంగవరం పోర్టులో దాదాపు లక్ష టన్నుల వరకు బొగ్గు నిల్వలు నిలిచిపోయాయి. సెయిల్ నుంచి తీసుకున్న బొగ్గు నిల్వలు కూడా ఇంకా చేరకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో సరిపడ బొగ్గు నిల్వలు లేకుండా పోయాయి. బ్యాటరీలు నడిచేందుకు కొన్ని గంటలకు సరిపడానే కోకింగ్ కోల్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.  స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం తీరును తప్పుబడుతున్నాయి. మరోవైపు తాజా పరిస్థితిపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్మిక సంఘాలను అత్యవసరంగా రావాలని ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details