ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడప జిల్లాలో ఘోరం- పాఠశాలకు వెళ్లలేదని స్టూడెంట్​ను కొట్టి చంపిన బాబాయ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 8:35 PM IST

Father Murdered Son for Not Going to School in Nagarigutta: తండ్రి తరువాత తండ్రి అంతటి వాడని, తండ్రి చనిపోతే పెదనాన్నే తండ్రిగా భావించి అమ్మ, చెల్లితో కలిసి అతని చెంతకు వచ్చారు. పిన తండ్రిగా కుమారుడు బాగోగులు చూసుకోవలసిన బాబాయ్ కుమారుని పాలిట కాలయముడయ్యాడు. స్కూల్​కి వెళ్లలేదనే నెపంతో దారుణంగా కొట్టటంతో (Sevierly Beaten) చిన్నాన్న చేతిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయాడు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల్లో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలో పులివెందుల పట్టణంలో నగరిగుట్టకు చెందిన రెడ్డి బాష తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాష తల్లి, చెల్లెలతో కలిసి బాబాయి ఇంట్లో ఉంటున్నారు. ఈరోజు పదొవ తరగతి పరీక్షలు కావడంతో రెడ్డి బాష పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్న కుమారుడిని చూసి కోపొద్రిక్తుడై దారుణంగా చితక బాదాడు. బాబాయ్ కొట్టిన దెబ్బలు తట్టుకోలేక బాష అక్కడికక్కడే చనిపోయారు(Died). తండ్రిలేని కుమారుడిని బాగా చదివి మంచి ప్రయోజకుడిని చేయవలసిన బాబాయ్ ఇలాంటి ఘటనకు పాల్పడడం పట్ల స్థానికులు ఆవేదన చెందుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details