ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గొడవలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేయడమే వైఎస్సార్సీపీ లక్ష్యం: ప్రభాకర్‌రెడ్డి - JC Prabhakar Reddy on YSRCP Attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 3:14 PM IST

Ex_MLA_JC_Prabhakar_Reddy_on_YSRCP_Attacks (ETV Bharat)

Ex MLA JC Prabhakar Reddy on YSRCP Attacks: ఓటమి భయంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలు దాడులకు దిగుతున్నారని తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఓంశాంతినగర్‌లో వైఎస్సార్సీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఘటనతో అక్కడకు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి దాడి జరిగిన ప్రాంతాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గొడవలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే తాడిపత్రి ఓటర్లకు దైర్యం ఎక్కువని, వైఎస్సార్సీపీ నేతలకు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. 

"ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలు రాళ్లదాడులకు దిగుతున్నారు. గొడవలతో ప్రజల్ని భయాందోళనకు గురి చేయడమే వైఎస్సార్సీపీ లక్ష్యం. తాడిపత్రి అనేది ప్రజలంతా కలిసి మెలిసి సంతోషంగా ఉండే ఊరు. తాడిపత్రి ఓటర్ల ధైర్యవంతులు. వైఎస్సార్సీపీ నేతలకు భయపడటం లేదు. రాళ్ల దాడిపై భయపడకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు." - జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details