ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు - ఈసీ అనుమతి - Anganwadi workers to election Duty

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 10:53 AM IST

Anganwadi_workers_to_election_Duty

Anganwadi Workers Contract Employees to Election Duty: జిల్లాల్లో పోలింగ్ విధులకు అంగన్వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులను వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్నందున వీరి సేవలను వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలు ఇచ్చింది. 

ఈ మేరకు వారికి ఇతర ఎన్నికల అధికారులుగా విధులు కేటాయించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం 12డీ స్వీకరణ గడువును మే 1వ తేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతో గడువు ముగియగా, దీన్ని పొడిగించారు. పోలీసులు, ఇతర అన్ని శాఖల పోస్టల్ నోడల్ అధికారుల జాబితా, పోస్టల్ బ్యాలట్లపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెబ్​సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details