ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏప్రిల్​ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు - summer Holidays

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 2:47 PM IST

school_holidays

Education Department Announced Summer Holidays for Schools : 2024-25 సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్​ ఎస్​. సురేష్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ ఏప్రిల్​ 24 నుంచి సెలవులు ప్రకటించారు. ఏప్రిల్​ 24 నుంచి జూన్​ 11 వరకూ దాదాపు 49 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ విద్యా శాఖ కమిషనర్​ సురేష్​ కుమార్​ ఉత్తర్వులు ఇచ్చారు. 

జూన్​ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని విద్యాశాఖ కమిషనర్​ సురేష్​ కుమార్​ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్​ను పంపారు. కమిషనర్​ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యా శాఖ వేసవి సెలవులను (summer Holidays) ప్రకటించడంతో విద్యార్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ABOUT THE AUTHOR

...view details