ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ యత్నం- జోగి రమేష్ ఫొటోలతో ముద్రించిన సంచులు స్వాధీనం - EC Seize Jogi Ramesh Gift Articles

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 12:17 PM IST

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ యత్నం- జోగి రమేష్ ఫొటోలతో ముద్రించిన సంచులు స్వాధీనం (ETV Bharat)

EC Authorities Seized Jogi Ramesh Gift Articles in Penamaluru: ఎన్నికల వేళ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అధికార వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంచిన తాయిళాలను, ప్రచార సామాగ్రిని పోలీసులు, ఈసీ విజిలెన్స్‌ బృందం స్వాధీనం చేసుకుంది. గంగూరులోని ఏవీఎం గార్డెన్స్​లోని ఓ ఇంట్లో నగదు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, ఈసీ స్పెషల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. 

తనిఖీల్లో మాజీమంత్రి జోగి రమేష్ ఫొటోలతో ముద్రించిన సంచులు, టీ షర్ట్‌లు, జెండాలు, టోపీలు కొన్ని బహుమతి పరికరాలు లభించాయి. పదుల సంఖ్యలో ఉన్న పెట్టెలు, మూటలను విప్పి అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్లాస్క్‌లు, వాటర్‌ బాటిళ్లు ఇతర ఉపకరణాలు ఉన్నాయి. ఈసీ విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా ఇంటిని తనిఖీలు చేసిన అనంతరం నగదు ఏమి లభించలేదని తెలిపారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details