తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రజలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం : భట్టి విక్రమార్క

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 5:00 PM IST

Deputy CM Bhatti Vikramarka on Law and Order Issue in Hyderabad : ఇందిరమ్మ రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవించాలనే కాంగ్రెస్​ సర్కార్​ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జూబ్లీహిల్స్​లోని రహమత్​ నగర్​ ప్రైమ్​ గార్డెన్​ సమావేశానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో సికింద్రాబాద్​ ఎంపీ స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.  

Bhatti Vikramarka on Parliament Elections 2024 : జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భట్టి(Bhatti Vikramarka) తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. తమ పాలనలో స్వేచ్ఛగా జీవించాలనే ముఖ్య ఆలోచన అని అన్నారు. హైదరాబాద్​లో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చామో వాటిని అమలు పరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ మహమ్మద్ అజారుద్దీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details