ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారుల స్వామిభక్తి - ఎన్నికల కోడ్ ఉన్నా ఉచిత ఇళ్లపట్టాల డీడ్‌లపై జగన్ పేరు - cm jagan name on house site deeds

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 3:57 PM IST

CM_Jagan_Name_on_Conveyance_Deeds

CM Jagan Name on Conveyance Deeds: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వ అధికారులు వైసీపీకి స్వామిభక్తి చాటుతున్నారు. కోడ్ వచ్చినా ఉచిత ఇళ్లపట్టాల డీడ్​లపై జగన్ పేరు కొనసాగించేలా కొందరు అధికారులు తాపత్రయ పడుతున్నారు. నవరత్నాల పథకం కింద ఉచిత ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్ కోసం కన్వేయన్సు డీడ్ పత్రాలను రిజిస్ట్రేషన్ అధికారులు జారీ చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అవుతున్నా అధికార వైసీపీకి ప్రచారం కల్పించేలా కన్వేయన్స్ డీడ్​ల జారీకి అధికారాలు నిర్ణయించారు. 

సీఎస్‌ అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీలో కన్వేయన్స్​ డీడ్​ల జారీకి అనుమతి కూడా జారీ అయ్యింది. కొనసాగుతున్న పథకంగా పేర్కొంటూ స్క్రీనింగ్ కమిటీలో ఈ డీడ్​ల జారీకి అధికారులు అనుమతి ఇచ్చేశారు. ఇప్పటి వరకూ 15 లక్షల మందికి ఉచిత ఇళ్ల పట్టాల కింద ఈ కన్వేయన్స్​ డీడ్​లను జారీ చేశారు. మరో 6 లక్షల డీడ్​లను ఇంకా జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కన్వేయన్స్​ డీడ్​లు చెల్లవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఇళ్ల పట్టాల డీడ్‌లపై జగన్ పేరును కొనసాగించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details