ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టిక్కెట్ రాని ఆశావహులకు కీలక పదవులు ఇచ్చిన చంద్రబాబు - Key Posts for TDP Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 5:56 PM IST

Updated : Mar 27, 2024, 1:35 PM IST

Key Posts for TDP Leaders

Key Posts for TDP Leaders : 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుగా పోటీగా దిగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్ సభ సీటు ఆశించిన టీడీపీ నేతలకు సీటు దక్కలేదు. సీటు కొల్పోయిన వారు బాధ పడాల్సిన పని లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే టీడీపీ నేతలకు కీలక పదవులు ఇచ్చి సత్కరించింది.

టీడీపీ నేతలకు కీలక పదవులు : సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ దక్కని ఆశావహులకు చంద్రబాబు నాయుడు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్​ జవహర్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా గండి బాబ్జి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డిలను నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మాదిరాజు మురళీ కృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసులను నియమించారు. కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఇచ్చారు. 

పార్టీ విజయానికి కృషి చేస్తా: హిందూపురం పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం విజయానికి కృషి చేస్తానని ఆ పార్లమెంట్‌ నూతన అధ్యక్షుడు బివి వెంకటరాముడు తెలిపారు. బలహీనవర్గాలే పునాదిగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మరోమారు రుజువైందని చెప్పారు. సాధారణ బీసి కుటుంబంలో పుట్టిన తనను హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​, అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని వెంకటరాముడు స్పష్టం చేశారు.

Last Updated : Mar 27, 2024, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details