ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనడం సంతోషంగా ఉంది: చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 12:32 PM IST

Chandrababu_Naidu_Attend_Pran_Pratishtha

Chandrababu Naidu Attend Pran Pratishtha : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనటం సంతోషంగా ఉందని చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నిండి ఉన్న శ్రీరాముడి వారసత్వ విశ్వాసాల్లో తాను భాగస్వామిని అయ్యానని ట్విటర్ (X) వేదికగా పేర్కొన్నారు.

Pran Pratishtha at Ram Temple in Ayodhya : శ్రీరాముడు మతాలకు, భౌగోళిక సరి హద్దులకు అతీతమని చంద్రబాబు నాయుడు తెలిపారు. రామ మందిరం కేవలం దేవాలయమే కాదని, మన దేశ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. శ్రీరాముడు మూర్తీభవించిన అన్ని విలువలకు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో పండుగ స్ఫూర్తి ఆశీర్వాదం తాను పొందానని అన్నారు. అందరి మధ్య మరింత ఐక్యతను పెంపొందిస్తూ, ఈ పవిత్రోత్సవం మన దేశానికి కొత్త శకానికి నాంది పలుకుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details