ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చంద్రబాబు, పవన్​ బహిరంగసభ- ప్రత్యక్షప్రసారం - CBN and Pawan Public Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 6:05 PM IST

Updated : Apr 24, 2024, 7:23 PM IST

Chandrababu_and_Pawan_Kalyan_Public_Meeting_Live
Chandrababu and Pawan Kalyan Public Meeting Live: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఎన్డీఏలో ఆయా నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఆడబిడ్డలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అధినేతలు కలసి ఉమ్మడిగా రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కలిసి విజయనగరం జిల్లాలోని డెంకాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని డెంకాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated :Apr 24, 2024, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details