ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కావాలనే కాలయాపన - వెంటనే చర్యలు తీసుకోవాలి: బొజ్జల సుధీర్​ రెడ్డి - Bojjala Sudhir Reddy Fire

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 2:04 PM IST

Bojjala Sudhir Reddy Fires on YCP leaders in Tirupati District : రేణిగుంట గోదాములో దొరికిన వైసీపీ ఎన్నికల సామగ్రిపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్‍ రెడ్డి డిమాండ్‍ చేశారు. సీజ్ చేసిన డంప్​ను తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రలోభాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా ఫ్లైయింగ్‍ స్క్వాడ్‍ అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

వైసీపీ నాయకులు వంద కోట్లు విలువ చేసే చీరలు, ప్రచార సామగ్రి, చేతి గడియారాలు, గొడుగులు రేణిగుంట సమీపంలోని గోదాములో నిల్వ చేసి ఎన్నికల వేళ ఓటర్లకు పంచి పెట్టాలని చూస్తున్నారని సుధీర్​ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం గురించి సీ- విజిల్​ యాప్​లో నిన్న మధ్యాహ్నం (మంగళవారం) ఫిర్యాదు చేస్తే సాయత్రం 6 గంటలైనా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని పీఆర్సీ బలగాలను రంగంలోకి దింపాలని ఈ సందర్బంగా డిమాండ్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details