ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆత్మ నిర్భర్ భారత్ తరహాలో ఆంధ్రను తయారు చేయాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 9:43 PM IST

narasimha_rao_on_ycp

BJP MP GVL Narasimha Rao on YCP Leaders: రాష్ట్రానికి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చారని ఆ సమయంలో వైసీపీ నేతలు నిర్మించుకోలేక ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలనడం అర్ధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి రాజధాని అమరావతే అని ఎప్పుడో బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ తరహాలో ఆత్మ నిర్భర్ ఆంధ్రగా తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కోర్టులో ఈ అమరావతి వ్యవహారం ఉండగా రాజధాని కోసం వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్మించలేక కాలం గడిపిందని అన్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కల ఆట ఆడారని అన్నారు. 

విశాఖ బీచ్​ రోడ్​లోని విజయ స్థూపం వద్ద పూల్వమా దాడిలో (Pulwama attack) అమరులైన జవానులకు నివాళులర్పించారు. జవాన్​లు దేశానికి వెన్నుముక లాంటి వారని అన్నారు. ఆ దాడిలో అమరులైన జవానులు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details