ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనం కోరుతోందీ అదేనా?! - ట్విట్టర్‌ (X)లో ట్రెండింగ్​లో 'బాబుసూపర్ సిక్స్'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:29 PM IST

Twitter (X) Trending Hashtag

Twitter (X) Trending Hashtag: దేశ వ్యాప్తంగా ట్విట్టర్‌లో బాబు సూపర్ సిక్స్  (#BabuSuper6) హ్యాష్ ట్యాగ్ 1వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. శంఖారావం పేరుతో నిన్న యువనేత లోకేశ్ పిలుపు మేరకు తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చే సూపర్-6 పథకాలను తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్తుంది. ట్విట్టర్ వేదికగా సూపర్-6 పథకాల ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి.

 చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు: 

1) 18ఏళ్లు నిండి ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం

2) తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు

3) ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

4) మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

5)ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు

6) ప్రతి రైతుకి ఏటా రూ.20వేల ఆర్థికసాయంతోపాటుగా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, రాబోయే ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన వంటి పథకాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details