ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ - విశ్రాంత ఉద్యోగిపై ఆటో డ్రైవర్ల దాడి - AutoDrivers Attack Retired Employee

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:28 PM IST

Auto Drivers Attack on Retired Employee in Anantapur : అనంతపురంలో ఆటో డ్రైవర్ల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగి ఇంటికి వెళ్లి కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం శివారు ప్రాంతం తపోవనం సర్కిల్ సమీపంలోని కాలనీలో శరత్ అనే ఆటో డ్రైవర్ రాము అనే విశ్రాంత ఉద్యోగి ఇంటికి ఆటోని అడ్డుగా పెట్టాడు. ఆటో పక్కకు తీయాలని విశ్రాంత ఉద్యోగి రాము కోరారు. శరత్​ ఆటో పక్కకు తీయకపోగా విశ్రాంత ఉద్యోగిపై దుర్భాషలాడాడు.

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ మరి కొంతమంది ఆటో డ్రైవర్లను వెంటపెట్టుకొని ఏకంగా విశ్రాంత ఉద్యోగి రాము ఇంటిలోకి వెళ్లి దాడి చేశాడు. దాడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆటో డ్రైవర్ల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఇరువురినీ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్​కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన కొంతమంది ఆటో డ్రైవర్ల పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details