ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్రకటిత కరెంటు కోతలతో మహిళలను, పిల్లలను ఉక్కపోతకు బలిపెడుతున్నారు -ఆచంట సునీత - Achanta Sunita fires on ycp gov

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 7:30 PM IST

Achanta_Sunita_On_Power_Supply

Achanta Sunita On Power Supply: అప్రకటిత కరెంటు కోతలతో రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 10 సార్లు బటన్ నొక్కి విద్యుత్త్ ఛార్జీలు  పెంచారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో నాణ్యమైన, అతి తక్కువ ధరకు విద్యుత్త్ అందిస్తే జగన్ హయాంలో 3 రెట్లు పెంచి ప్రజలపై బాదుడుకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను నయవంచనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రజలపై లక్షల కోట్ల భారం వేసిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది.

జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నారని, రకరకాల బిల్లులతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని సునీత మండిపడ్డారు. జగన్ 95 శాతం హామీలు నెరవేర్చానని ప్రజల్లోకి వచ్చి అబద్ధపు మాటలు చెబితే నమ్మేవారు లేరన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వర్ణంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ అనేవారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అంధకార ఆంధ్రప్రదేశ్​గా పిలుస్తున్నారని దుయ్యబడ్డారు. 130సార్లు బటన్లు నొక్కి 130 సంక్షేమ పథకాలు రద్దు చేశారనేది ప్రజలు అర్థం చేసుకున్నారని సునీత స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details