ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు - DSP on Subbarao family Suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 2:01 PM IST

Subbarao family Commit Suicide: నిన్న ఒంటిమిట్టలో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కడప జిల్లా డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. అప్పుల బాధలు తాళలేకనే సుబ్బరావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. అయితే, సుబ్బారావు కుమార్తె మాత్రం తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించింది.

Subbarao family Commit Suicide
Subbarao family Commit Suicide

Subbarao Family Commit Suicide:ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం చేనేత కుటుంబం ఆత్మహత్యపై వైఎస్ఆర్ జిల్లా కడప డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. అప్పుల బాధ తాళలేకే సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ తెలిపారు. సుబ్బారావుకు దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు అప్పు ఉందని పేర్కొన్నారు.

సుబ్బారావు మెుదట తన భార్య, కూతురిని గొంతు నులిమి హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. తన మూడు ఎకరాల పొలం వేరొకరు ఆన్లైన్ లో మార్చు కున్నారని మనస్థాపం చెందాడని వెల్లడించారు. సుబ్బారావు తనదిగా చెబుతున్న మూడు ఎకరాల పొలం ప్రభుత్వానికి చెందిందని డీఎస్పీ తెలిపారు. మూడు ఎకరాల పొలంపై రెవెన్యూ అధికారులు సైతం నివేదిక ఇచ్చారని తెలిపారు.

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు

సుబ్బారావుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి పట్టా ఇవ్వలేదు. కానీ 2015 లో మూడు ఎకరాల పొలాన్ని ఆన్లైన్ చేసుకున్నాడు. ఆన్లైన్​లో ఎక్కించిన రెవెన్యూ అధికారులు ఎవరనే దానిపై కడప ఆర్డీవో ఆరా తీస్తున్నారు. 2017లో ఈ భూమి శ్రావణి పేరుతో ఆన్లైన్​లోకి మారింది. ఇద్దరికీ ఎలాంటి ప్రభుత్వ పట్టాలు లేవు. ఆన్లైన్​లో మాత్రమే రికార్డు ఉంది.ఆన్లైన్​లో పేరు ఎక్కించిన మధ్యవర్తులు, రెవెన్యూ అధికారులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం -షరీఫ్​, డీఎస్పీ

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో పాల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, ఇది ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యేనని జనసేన నేత అత్తికారి దినేష్ ఆరోపించారు. మృతి చెందిన పాల సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలను దినేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుబ్బారావుకు ఉన్న మూడు ఎకరాల 10 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని 2015లో కట్ట శ్రావణి పేరు మీద ఆన్లైన్ చేశారని వెల్లడించారు.

బెజవాడ బస్టాండ్​లో బ్లేడ్​బ్యాచ్, యాచకుల వీరంగం - ఏకంగా పోలీసులపైనే దాడి

భూమి విషయంపై అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని దినేష్ ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. సుబ్బారావు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దినేష్ తెలిపారు. సుబ్బారావు కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తమ పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరుపై ఎక్కించారని సుబ్బారావుకు పెద్ద కుమార్తె నిత్య తెలిపింది. తమ కుటుంబం అత్మహత్య చేసుకోవడానికి వైసీపీయే కారణమని నిత్య పేర్కొంది. తమ పేరుపై ఉన్న భూమిని మరొకరి పేరు పైకి ఎక్కించడంతో, తన తల్లిదండ్రులు గత కొంత కాలంగా మానసికంగా ఇబ్బందులు పడ్డారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని నిత్య ఆరోపించింది.

యథేచ్ఛగా వాలంటీర్లు ఎన్నికల ఉల్లంఘన - ఈసీ వేటు

ABOUT THE AUTHOR

...view details