ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంజినీర్​ కావాల్సినవాడు క్రిమినల్​ అయ్యాడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 9:46 PM IST

Young Man Arrested for Killing 76 Year Old Woman: చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో ఉండాల్సిన యువకులు వ్యసనాలకు బానిసలై డబ్బులు కోసం ఎంతటి దారుణం చేయడానికైనా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలకు ప్రత్యక్ష ఉదాహరణ విజయనగరం జిల్లాలో జరిగిన వృద్ధురాలి హత్యే.

young_man_kill_old_woman
young_man_kill_old_woman

Young Man Arrested for killing 76 Year Old Woman:చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువకులు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఈ హత్యే ఉదాహరణ. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారి పిల్లలను ప్రయోజకులుగా చూడాలనే ఆశ పడుతుంటారు. ఇందుకోసం వాళ్లు తిన్నా తినకున్నా పిల్లల్ని మంచి కాలేజీల్లో చేరుస్తారు. తమ మాదిరిగా పిల్లల బతుకులు కాకూడదని అప్పోసప్పో చేసి చదివిస్తుంటారు. పిల్లలు ఏది అడిగినా కాదనకుండా కొనిస్తారు. అంతేకాదు ఎంత డబ్బైనా వేరే ప్రాంతాల్లో ఉంచి మరీ చదివిస్తుంటారు. కానీ కొంతమంది స్నేహితులతో ఉంటూ చెడు వ్యసనాలకు బానిపై అడ్డొచ్చిన వారిని అతి కిరాతకంగా చంపుతూ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు.

సీఎం నివాస ప్రాంతంలో ఘర్షణ- గంజాయి మత్తులో యువకుడిపై దాడి

Vizianagaram:విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం మహరాజుపేట గ్రామంలో గత గురువారం రాత్రి హత్యకు గురైన ముద్దాడ అప్పయ్యమ్మ (76) కేసును సీఐ వెంకటేశ్వరరావుతో పాటు, ఎస్ఐ సూర్యకుమారి సిబ్బందితో కలిసి చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం భోగాపురం సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

చెడు వ్యసనాలకు బానిస:హత్యకు గురైన వృద్ధురాలిది మహారాజుపేట గ్రామం. ఈమెకు ఒకే చోట 5 గృహాలు ఉండగా, వాటిని అద్దెకిచ్చి జీవనం సాగిస్తుంది. ఆమె ఒంటిపై నిత్యం సుమారు 15 తులాల బంగారం ఉంటుంది. ఆమె ఇంట్లో ఇజ్జవరపు కూర్మారావు అనే యువకుడు అద్దెకు దిగాడు. ఇతను సమీప ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అదే ఇంట్లో ఈ యువకుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు అక్కడే ఉంటున్నారు. సంక్రాంతి పండగకు స్నేహితులిద్దరూ వాళ్ల సొంతూరు వెళ్లగా కూర్మారావు మాత్రం ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇతను గత కొన్నేళ్లుగా మద్యం తదితర చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.

DTH​ రీఛార్జ్​ కాలేదని దారుణం- షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం, ముగ్గురు యువకులు అరెస్ట్

ఈ విషయంపై ఇంటి యజమాని అప్పయ్యమ్మ అనేకమార్లు ఆ యువకుడితో ఘర్షణ పడింది. బుదవారం సాయంత్రం ఇదే విషయంపై ఆ యువకుడిని ప్రశ్నించగా, కూర్మారావు అప్పయ్యమ్మను గట్టిగా కొట్టడంతో కిందపడిపోయింది. దీంతో శ్వాస ఆడనివ్వకుండా చేసి చంపేసాడు. మృతదేహాన్ని మరుగుదొడ్డిలో పడేసి కాలు జారి పడిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాలు పుస్తెల తాడు, మూడు గాజులను తీసుకున్నాడు. నాలుగో గాజు తీస్తుండగా మరుగుదొడ్డి బేసిన్లో పడిపోవడంతో దాన్ని పదిలేసి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంజినీర్​ కావాల్సినవాడు క్రిమినల్​ అయ్యాడు

చెప్పులతో బెదిరిస్తూ ఆకతాయి చేష్టలు- కోపంతో ఎదురుతిరిగిన గజరాజు​- తర్వాత?

ఆ యువకుడి కోసం గాలించిన పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించారు. గొట్లాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కూర్మారావుని పట్టుకొని తనదైన విచారణ చేయగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. ముద్దాయిని పట్టుకోవడంలో సహకరించిన ఎస్ఐ పి. సూర్యకుమారి, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details