ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముప్పు ముంగిట్లో శ్రీశైలం ప్రాజెక్టు - మొద్దునిద్రలో జగన్ సర్కార్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:04 AM IST

YCP Government Neglects Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నా ప్లంజ్‌పూల్‌ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైనా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నా వైఎస్సార్సీపీ సర్కార్‌కు చీమకుట్టినట్లు అయినా లేదు. ఒక్కసారైనా నిపుణుల బృందంతో అధ్యయనం ప్రారంభించకపోగా సమస్య తీవ్రతపై కనీసం ఐదేళ్లుగా స్పందించలేదు.

_srisailam_project
_srisailam_project

ముప్పు ముంగిట్లో శ్రీశైలం ప్రాజెక్టు - మొద్దునిద్రలో జగన్

YCP Government Neglects Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. పెనుముప్పు తలెత్తే ప్రమాదం ఉండటంతో ప్రజలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం డ్యాం ముందు భాగంలో 130 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు రూ. 15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ. 137 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి ఆరు నెలల కిందట ప్రతిపాదనలు పంపారు.

ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్? రాష్ట్రంలో మూత'బడు'లు - చదువులకు దూరం అవుతున్న పిల్లలు

అధ్యయనం ప్రారంభించే అవకాశాలే లేవు: దీని ఆధారంగా ప్రపంచబ్యాంకు తరఫున ‘డ్యాంసేఫ్టీ రివ్యూ ప్యానెల్‌’ ప్రతినిధులు సుమారు రెండు నెలల కిందట ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులకు కొన్ని సూచనలు చేసి తదనుగుణంగా ప్రతిపాదనలను మార్చి పంపాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు పంపాక నిధులు విడుదలయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్లంజ్‌పూల్‌ను పూడ్చేందుకు చేయాల్సిన అధ్యయనాలనూ ప్రతిపాదనల్లోనే పొందుపరిచారు. దీంతో ఆయా పనులకు నిధులు మంజూరైతే గానీ ప్లంజ్‌పూల్‌ పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభించే అవకాశాలు లేని దుస్థితి తలెత్తింది.

ఇందూటెక్‌కు భూములు- టక్కుటమార విద్యలతో జగన్​ కంపెనీలకు నిధులు! సీబీఐ చార్జిషీట్​పై 234 వాయిదాలు ​

ప్లంజ్‌పూల్‌ ముప్పు తీవ్రం:డ్యాంల భద్రత చట్టం-2021ని కేంద్రం అందుబాటులోకి తెచ్చాక జలశక్తి మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా పలు డ్యాంల స్థితిగతులను అధ్యయనం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు ప్రాజెక్టును ఇటీవల పరిశీలించారు. ప్లంజ్‌పూల్‌ ముప్పు తీవ్రమైనది కావడంతో ఈ పనులను అత్యవసరంగా ప్రారంభించాలని స్పష్టమైన సూచనలిస్తారని తెలుస్తోంది. డ్యాం ప్లంజ్‌పూల్‌ పూడ్చివేత పనుల అధ్యయనంతో సహా మొత్తం రూ. 137 కోట్ల విలువ మరమ్మతులు సత్వరం చేయించాల్సి ఉంది.

చెత్తపై వినియోగ రుసుముతో జనం బెంబేలు - పట్టణ ప్రజలపై బాదుడుకు జగన్ సర్కారు సిద్ధం

అత్యవసర పనులపైనా జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం:రిటైనింగ్‌ గోడలు, డౌన్‌స్ట్రీమ్‌ యాప్రాన్, సిలిండర్లు, యాప్రాన్‌ దగ్గరకు వెళ్లే అప్రోచ్‌ రోడ్డు తదితర పనులు చేయించాలి. ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ వైకే మూర్తి ఆధ్వర్యంలోని మరో కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎబీ పాండ్యా నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఇప్పటికే అధ్యయనాలు చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఆయా సిఫార్సులు అమలుకు నోచుకోకపోగా అత్యవసరంగా చేయాల్సిన పనులపైనా జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details