ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో ఐదేళ్లుగా బానిసల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలు - United form Round Table Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:49 AM IST

United form Round Table Meeting in Nellore : రాష్ట్రంలో ఐదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం నెల్లూరులో ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

united_form_round_table_meeting_in_nellore
united_form_round_table_meeting_in_nellore

United Form Round Table Meeting in Nellore :రాష్ట్రంలో ఐదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నెల్లూరులో ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. భయంతో ఆత్మగౌరవం లేకుండా బానిసల్లా బతుకుతూ హక్కుగా సంక్రమించిన వాటిని కూడా అడగలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు.

ఇప్పటికైనా మౌనం వీడండి, భయపడవద్దు. సమస్యలు పరిష్కారానికి ముందుకు రండి. ఐక్యంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహణలో పాల్గొనండని ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక చైర్మన్​ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నెల్లూరు జిల్లాలోని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర నాయకుడు, ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ, ఐక్యవేదిక ప్రోచైర్మన్ హరికృష్ణ , ఐక్యవేదిక సెక్రటరీ బాజీపఠాన్ హాజరయ్యారు. వీరితో పాటు జిల్లాలోని పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు జగన్​ మాయ మాటలు - ఐదేళ్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చేసిందేంటి ? - Jagan lied employees and teachers

భయంతో ఆత్మగౌరవం కూడా లేకుండా బానిసల్లాగా బతుకుతూ హక్కుగా సంక్రమించిన వాటిని కూడా అడగలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. హక్కులు అడిగితే ఏమవుతుందోననే పరిస్థితి నెలకొంది. ప్రశ్నిస్తే సంఘాలమీద దాడికి పూనుకోవడం చూశాం. చరిత్రలో లేని విధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా జీతాలు ఒకటో తేది వేయమని అడిగితే క్రిమినల్ కేసులుపెట్టి వెంటాడిన పరిస్ధితి ఈ రాష్ట్రంలో నెలకొంది. రాబోయే రోజుల్లో ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితులు, హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు ప్రభువుల దయకాదు రాజుగారుపెట్టే బిక్షకాదు అని చాటి చెప్పాలి. -కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ

గత ఎన్నికల్లో ప్రైవేట్​ టీచర్లపై ఎక్కడ లేని ప్రేమ - పదవీకాలం ముగుస్తున్నా పట్టించుకోని జగన్​ - Jagan Govt Cheated Private Teachers

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంపాదించుకున్న చెల్లింపులు నిర్దిష్ట నిబంధనల ప్రకారం కాలపరిమితుల్లో జరిగేలా చట్టబద్దమైన వ్యవస్థను తీసుకురాకపోతే భవిష్యత్తులో జీతాలు, పింఛన్లు ప్రశ్నార్థమవుతాయని అన్నారు. సీపీఎస్, ఎంప్లాయిస్హెల్త్ స్కీమ్వి, లేజ్​వార్డు సెక్రటరీ సమస్యలు, అన్ని సమస్యలు, 25వేల కోట్లు బాకీలు పేరుకుపోతున్నాయని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కథనాలు వస్తున్నాయన్నారు. అయోమయంలో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. అధికారికంగా రావలసినది ఎంత అనేది రాష్ట్ర పరిస్ధితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయలేకపోవడం అయోమయంగా మారిందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘలు ఐక్యంగా లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాల మనుగడ కోల్పోతాయని అన్నారు. ఇప్పటికైనా మౌనం వీడండి, భయపడవద్దు. సమస్యలు పరిష్కారానికి ముందుకు రండి. ఐక్యంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహణలో పాల్గొనండని పిలుపునిచ్చారు.

అసంపూర్తిగా గురుకుల భవనం - శిథిలావస్థకు చేరినా పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్రంలో ఐదేళ్లుగా బానిసల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలు

ABOUT THE AUTHOR

...view details