ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కూలీలను ఢీ కొట్టిన రైలు - బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తోటి కూలీల డిమాండ్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 7:18 PM IST

Updated : Mar 11, 2024, 9:37 PM IST

Train Hit the Private Laborers Working on The Railway Track in Kurnool District : రైల్వే ట్రాక్ పై పని చేస్తున్న కార్మికులు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా మద్దికెర-తుగ్గలి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. గుంతకల్లు నుంచి డోన్ వెళ్తున్న డెమో ప్యాసింజర్ రైలు ఢీకొని ఇద్దరు కూలీలు మృతి చెందారు.

train_accident
train_accident

ప్రైవేట్ కూలీలను ఢీ కొట్టిన రైలు - బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తోటి కూలీలు డిమాండ్‌

Train Hit the Private Laborers Working on The Railway Track in Kurnool District : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రైవేటు కూలీలు మృతి చెందారు. జిల్లాలోని మద్దికెర - తుగ్గలి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్​పై పని చేస్తున్న కార్మికులు రైలు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గుంతకల్లు నుంచి డోన్​ వెళ్తున్న డెమో ప్యాసింజర్​ రైలు (Demo passenger train) ఢీ కొని ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. వీరిలో తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన కృష్ణన్న (60), ఓబులేసు (40) అనే ఇద్దరు కార్మికులు ఉన్నారు.

ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను ఢీకొట్టిన రైలు​- ఇద్దరు మృతి

Two Persons Died in Kurnool District :రోజు లాగానే తోటి కార్మికులతో కలిసి రైల్వే పనికి బయలు దేరారు. ఇవాళ మధ్యాహ్నం వరకు రైల్వే పనులు ఎంతో చురుకుగా చేశారు. పని చేసే సమయంలో దుమ్ము, ధూళి కారణంగా రైలు శబ్దాన్ని గుర్తించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కృష్ణన్న, ఓబులేసు కుటుంబాలను రైల్వే అధికారులు ఆదుకోవాలని తోటి కార్మికులు తెలిపారు. బాధిత కుటుంబాలకు వీలైనంత తొందరలో నష్టపరిహారం చెల్లించాలని కోరుకున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైల్వే అధికారులను హెచ్చరించారు.

ట్రాక్​పై లారీ బోల్తా- రైలుకు ఎదురెళ్లి వృద్ధ జంట సాహసం- వందల మంది ప్రాణాలు సేఫ్!

తోటి కూలీల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం జరగడానికి కారణాలను తోటి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోజు కూలీకి వెళ్లి సంపాదన ఆర్జించే యాజమాని ఇక లేడని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తనకు, తన పిల్లలకు దిక్కు ఎవరని పుట్టెడు శోకంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో రాంపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Mar 11, 2024, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details