ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అరకులోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - మూడు బైకులు ఢీకొని నలుగురు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 7:58 AM IST

Road Accident Near Araku Valley: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యకోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

Road_Accident_Near_Araku_Valley
Road_Accident_Near_Araku_Valley

Road Accident Near Araku Valley: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని మాదల పంచాయతీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అరకులోయ మండలంలోని నందివలస గ్రామంలో మహాశివరాత్రి జాతరకు చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మాదల పంచాయతీ తుమ్మగుడ్లి గ్రామ సమీపంలో మూడు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది. మృతుల్లో చర్లపూడి గ్రామానికి చెందిన బురిడి హరి (22), అమ్మనాకాంత్‌ (9), లోతేరు పంచాయతీ మంజగుడకి చెందిన త్రినాథ్‌ (32), భార్గవ్‌ (4)లు ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా - 13 మందికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details