ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి- ఇంకొకరికి తీవ్ర గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 11:02 AM IST

Road Accident in Tirupati Two Died : రాష్ట్రంలో రోడ్లు రక్తమొడుతున్న ఘటనలు మనసు చలించిపోయేలా చేస్తున్నాయి. జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణించడం, హెల్మెట్​ లేని ప్రయాణాలు, అధిక వేగం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

road_accident_in_tirupati_two_died
road_accident_in_tirupati_two_died

Road Accident in Tirupati Two Died :తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్పరెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హేమంత్, వెంకటేష్ , బాలాజీ అనే యువకులు నెల్లూరులోని స్వీట్ స్టాల్లో పనిచేస్తన్నారు. దిగువ పుత్తూరులో జరుగుతున్న వివాహ వేడుకలలో పాల్గొనేందుకు బైక్ పై నెల్లూరు నుంచి బయలు దేరారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా బాలాజీకి గాయాలయ్యాయి. స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.

అరకులోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - మూడు బైకులు ఢీకొని నలుగురు మృతి

Three killed one Injured in Road Accidents AP : ఆ నిరు పేద కుటుంబాన్ని విధి వెంటాడింది. ఏడాదిలోనే అన్నదమ్ముల్ని బలిగొని వారి కుటుంబంలో విషాదం నింపింది. గతేడాది పెద్ద బిడ్డ సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడని, ఇప్పుడు మూడో కుమారుడ్ని వాహనం చిదిమేసి తమకు తీరని శోకం మిగిల్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు త్రిపురాంతకం పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లికి చెందిన అలగముతక చిన్న వెంకటరామయ్యకు ముగ్గురు కుమారులు.

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం- సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం

Road Accident in Prakasam District : పేద కుటుంబానికి చెందిన ఆయన గత రెండు రోజులుగా కుటుంబంతో కలిసి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వేడుకల్లో చివరిరోజైన ఆదివారం రథోత్సవం కావడంతో అందరూ స్థానిక వడ్డెర సత్రంలో ఆనందంగా గడుపుతున్నారు. చిన్న కుమారుడైన శ్రీను(23) ఆదివారం ద్విచక్ర వాహనంపై మిట్టపాలెం వెళ్లి, అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలోనే గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు (Case) నమోదు చేశారు. ప్రమాదవశాత్తు సాగర్ కాలువలోకి పడి ఏడాది క్రితం పెద్ద కొడుకును కోల్పోయామని, ఇప్పుడు ఆఖరి కుమారుడు కూడా చనిపోయాడని మాతృమూర్తి కన్నీరు మున్నీరయ్యారు.

పాక్​లో ఘోర ప్రమాదం- లోయలో బస్సు పడి 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details