ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుడివాడా గుంతలవాడా? - నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన క్యాసినో ఎమ్మెల్యే - Roads Condition In Gudivada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 8:00 PM IST

Public Facing Problems With Damage Roads in Gudivada Constituency: గుడివాడ నియోజకవర్గానికి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే కానీ పట్టణంలో రోడ్లు మాత్రం అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. గుంతల్లో వాహనాలు నడపలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుడివాడ పట్టణాన్ని కలిపే గ్రామీణ ప్రాంతాల రహదారులు కూడా దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

roads_condition_in_gudivada
roads_condition_in_gudivada

Public Facing Problems With Damage Roads in Gudivada Constituency:కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుంది ఎంత మోజార్టీ వస్తుందన్న దానిపై ఇప్పటికే భారీ ఎత్తున బెట్టింగులు మొదలయ్యాయి. అంతటి కీలకమైన నియోజకవర్గంలో ప్రజల మార్పుకోరుకుంటున్నట్లు చెబుతున్నారు. పంట చేలు, విద్యాలయాలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతాన్ని జూదశాలల నిలయంగా మార్చడాన్ని నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

రహదారి లేక మధ్యలోనే నిలిచిన అంబులెన్స్- కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ గ్రామానికి - Father Carried Son Dead Body 8 km

గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లోని మల్లయ్యపాలెం, పెంజెండ్ర, మోటూరు, చిత్రం, నందిపాడు, తుమ్మలపల్లి, రామాపురం, ఐనంపూడి, జొన్నపాడు, విన్నకోట తదితర గ్రామాల్లో రహదారులు ప్రజలను భయపెడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కూలీలు, విద్యార్థులు, మహిళలు, రైతులు, వ్యాపారులు నియోజకవర్గ అభివృద్ధి, రహదారుల నిర్మాణంపై ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతల నుంచి సమాధానాలు రావడం లేదు. 20 యేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది శూన్యమని గుడివాడ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. రహదారులకు మరమ్మత్తులు చేయాలని ఎన్నిసార్లు కొరినా ఫలితం లేదని వాపోతున్నారు.

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - ముందుకు సాగని పట్టణ, నగరాభివృద్ధి - Negligence on Urban Development

నియోజకవర్గంలో ఏ దారి చూసినా గుంతలతో దర్శనమిస్తుంది. రోజూ సుమారు 25,000-30,000 మంది వివిధ ప్రాంతాల మంచి గుడివాడ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన పట్టణానికి కలిపే దారులన్నీ మరమ్మతులు లేక దెబ్బతిన్నాయి. కంకిపాడు, గుడివాడ ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అంతర్గత మార్గాలు, గ్రామీణ ప్రాంతాల రహదారులు ఆద్వానంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలపై కొత్తగా గుడివాడ పట్టణానికి వచ్చిన వారిలో 80 శాతం మంది ప్రమాదాలకు గురవుతున్నారని గుడివాడకు చెందిన వారే చెబుతున్నారు.

గన్నవరాన్ని గాలికొదిలేసిన జగన్ - ఐదేళ్లలో అభివృద్ధి ఊసేలేదు ​ - YCP did not develop Gannavaram

కంకిపాడు-గుడివాడ మార్గం, గుడివాడ బైస్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. దొండపాడు, వలివర్తి, లింగవరం, పోలుగూడు, గుడివాడ నుంచి నందివాడ, జనార్ధనపురం, తుమ్మలపల్లి, కుదరవల్లి, రామాపురం రహదారులు గుంతల మయంగా మారాయి. ఎన్నికల సమయంలో జనం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రోడ్లు తవ్వి సరిచేశారు. నియోజకవర్గంలో రోడ్లే బాలేవు అనుకుంటే, వైసీపీ హయాంలో రైతులకు రాయితీల్లేవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వంట కొనుగోళ్లు చేపట్టినా లాభం లేదు. అక్వా సాగుచేసే వారికి గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ తీసేశారని రైతులు వాపోతున్నారు. మెత్తంగా ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి విపక్షాలను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details