ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడేళ్లుగా గాలికి చెరువుల నిర్వహణ - గుడివాడ ప్రజలకు తప్పని దాహం కేకలు - Drinking Water Crisis in Gudivada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 12:09 PM IST

People Suffering From Drinking Water in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలు గుక్కెడు మంచినీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల గుడివాడ పట్టణ వాసులు గొంతు ఎండిపోతుంది. ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో రెండు మంచినీటి చెరువులు నిర్మాణం చేశారు. వాటి నిర్వహణను మూడు సంవత్సరాలుగా గాలికొదిలేయడంతో నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిల ద్వారా వచ్చే నీరు పచ్చగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

People Suffering From Drinking Water in Gudivada
People Suffering From Drinking Water in Gudivada

మూడేళ్లుగా గాలికి చెరువుల నిర్వహణ - గుడివాడ ప్రజలకు తప్పని దాహం కేకలు

People Suffering From Drinking Water in Gudivada:కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. నీళ్లివ్వండి మహో ప్రభో అంటూ స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నా ఫలితమే లేదంటూ చేష్టలుడిగి పోతున్నారు. తమ గోడు పట్టించుకునేవారే లేరని స్థానికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల ఆలసత్వం కారణంగా గుడివాడ పట్టణ వాసులను దాహం కేకలు వెంటడుతున్నాయి.

గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో పెద ఎరుకపాడులో 63 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు, 105 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మరొక మంచినీటి చెరువును నిర్మించారు. చెరువుల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత చెరువుకు మూడు సంవత్సరాల క్రితం గండి పడితే ఇంత వరకు దాన్ని పూడ్చలేదు. నిర్వహణ లేకపోవడంతో కొత్త చెరువు కట్ట కూడా బలహీనంగా మారింది. దీంతో ఈ చెరువులో నీటిని నింపితే ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2 చెరువులు ఆధ్వాన స్థితికి చేరడంతో అధికారులు వాటిల్లో నీటిని నింపకుండా వదిలేశారు. దీంతో చెరువుల్లో నీరు మట్టం తగ్గిపోయింది.

నీళ్లు పచ్చగా వస్తున్నాయి. పది నిమిషాలు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. వేసవి కాలంలో నీరు లేకుండా ఎలా బ్రతకాలి. అన్నీ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నీళ్లు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వ విధానాలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానం బాగోలేనప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారు. మంచి నీటి చెరువు కట్టతెగిపోయింది. మూడు సంవత్సరాల నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దాని కారణంగా గుడివాడ మొత్తం నీరు కోసం ఇబ్బంది పడుతోంది. -మోనాలిక, స్థానికురాలు

నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur

గుడివాడలోని పెద ఎరుకపాడు, ఇందిరా నగర్, మందపాడు కొత్త కాలనీ, గుడ్​మెన్ పేట, ధనియాల పేట, బాపుజీ నగర్, కార్మిక నగర్ సహా వివిధ కాలనీల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. చెరువుల్లో నీరు లేకపోవడంతో ఇప్పటికే అధికారులు రోజు విడిచి రోజు మంచినీటిని వదులుతున్నారు. అది కూడా 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే విడుదల చేస్తుడటంతో స్థానికులు గొంతు తడుపుకోవడానికి అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు విడుదల చేస్తున్న నీరు కూడా మురికిగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు తాగి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదకొరపాడు రైతులు నష్టపోయినా సరే గుడివాడ ప్రజల కోసం భూములు ఇచ్చారు. రైతుల పంట పొలాలు మునిగి నష్టపోతే పట్టించుకునే పరిస్థితిలో గుడివాడ శాసనసభ్యుడు లేడు. కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నా ఎవ్వరూ పట్టించుకున్నదే లేదు. పంపుషెడ్ల నిర్మాణం కోసం వచ్చిన నిధులు ఏమవుతున్నాయో తెలియదు. -స్థానికులు

గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో - కోన గ్రామస్థుల ఆవేదన - WATER PROBLEM IN KONA

మంచినీటి చెరువులు ఉన్నా కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలుగుదేశం హయంలో అమృత్ పథకంలో భాగంగా 2018లో గుడివాడలో ప్రతి ఇంటికి కూళాయిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం నాగవర్పాడు, గుడ్ మెన్ పేటలో రెండు ట్యాంక్​లను నిర్మించారు. అప్పుడే పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని గాలికి వదిలేయడంతో నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

'మాకు నీళ్లివ్వండి మహాప్రభో!- ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన గ్రామస్థులు - Drinking Water Problem

ABOUT THE AUTHOR

...view details