ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమ వరి పొలాల్లో బైకులు నడిపిన రైతులు - Paddy Crop Damage

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:06 PM IST

Paddy Crop Damage with Irrigation Water Crisis: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పొలాలు ఎండిపోయాయని రైతులు వరి పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు.

Paddy_Crop_Damage
Paddy_Crop_Damage

Paddy Crop Damage with Irrigation Water Crisis :కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గ్రాంటు చివరి ఆయకట్టు పరిధిలో నీరందక వరి పొలాలు ఎండి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పొలాలు ఎండిపోయాయని రైతులు వరి పొలాల్లో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని అన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పురుగుల మందు తాగి చనిపోవడం తప్ప మరో మార్గం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నీరు వదలాలని ఆదేశించినా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.

గోదావరి డెల్టాలో సాగునీటి సంక్షోభం - సాగునీరందక ఎండిపోతున్న వరిపైరు - Water Crises in Godavari Delta

మాకు చావే దిక్కు : "40 రోజలు నుంచి చుక్క సాగు నీరు రావడం లేదు. నీరు లేక వరి పంట ఎండిపోతుంది. అధికారులను అడిగితే నీరు అందిస్తామని చెబుతున్నారు. కానీ వారి మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రతీ రైతు 40 నుంచి 50 వేల రూపాయల పెట్టుబడులు పెట్టాం. అధికారులు మాకు న్యాయం చేయకపోతే చావే దిక్కు."- వరి రైతులు

వరి పంటకు నీరు అందించకుంటే మాకు చావే దిక్కు: అన్నదాతలు

కొమ్మమూరు కాలువకు నిలిచిన సాగునీరు - ఎండిపోతున్న పంటలు

నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details