ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేడు: నారా లోకేశ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 9:30 PM IST

Nara Lokesh Comments on CM Jagan: అమరావతి పేరు వింటేనే జగన్​కు వణుకు పుడుతుందని, చివరికి సినిమాలో రాజధాని పేరు విన్నా ఉలిక్కిపడుతున్నారని నారా లోకేశ్​ ఎద్దేవా చేశారు. అమరావతి శాశ్వత నగరమని జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేరని విజయనగరం జిల్లాలోని శంఖారావంలో స్పష్టం చేశారు.

nara_lokesh_comments_on_cm_jagan
nara_lokesh_comments_on_cm_jagan

Nara Lokesh Comments on CM Jagan: చొక్కా చేతులు మడతపెడతామంటూ సీఎం జగన్ గూండాగిరీ చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు చొక్కాలు మడత పెడితే, పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లూ మూడు ముక్కలాట ఆడిన వైఎస్సార్​సీపీ నేతలు, ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించమంటూ కొత్త నాటకానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేడు: నారా లోకేశ్​

వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధమా: ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర నిర్వహిస్తున్న నారా లోకేశ్​ నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వైఎస్సార్​సీపీ పాలనపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఏ ఇంటికెళ్లి అడిగినా ఇదే మాట చెబుతారని, ఈ అంశంపై ఇంటింటికీ వెళ్లేందుకు వైఎస్సార్​సీపీ నాయకులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

'ఆ కుర్చీనట్టా మడత పెట్టి' - సీఎం జగన్​కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్​

మహిళల తాళిబొట్లు తెంపుతున్నారు: మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని, జగన్‌కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం (Contaminated Wine) తయారుచేసి మహిళల తాళిబొట్లు తెంపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని లోకేశ్​ హెచ్చరించారు.

ప్రతి పథకం వెనక ఓ కుట్ర: తనను అరెస్ట్ చేయించేందుకు తహతహలాడుతున్న వైఎస్సార్​సీపీ నేతలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒక్క కేసైనా చూపించగలరా అని లోకేశ్​ సవాల్ విసిరారు. విజయనగరం బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్​ నిజాయతీగా నడుస్తున్న మాన్సాస్ ట్రస్టును దోచుకునేందుకు వైఎస్సార్​సీపీ నేతలు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. జగన్ ఏ పథకం (YSRCP Schemes) తీసుకువచ్చినా దాని వెనుక కుట్ర ఉంటుందని అన్నారు.

ఉత్తరాంధ్రపై 3 కుటుంబాల పెత్తనం - కనిపించిన భూమినల్లా మింగేస్తున్నారు: లోకేశ్

వేల ఎకరాలు ధారాదత్తం చేసిన అశోక్ గజపతిరాజు లాంటి గొప్పనేతలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. వారికి వాలంటీర్లు ఉంటే, మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

MLA Appala Narasiah స్థానిక ఎమ్మెల్యే అప్పలనరసయ్య భూ కబ్జాదారుడని, కావాలని గొడవలు పెట్టి భూములు లాక్కునే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. బొత్స సోదరులు పోలవరం కుడికాలువ అలైన్‌మెంట్ మార్చారని, తాము వచ్చాక పోలవరం కుడికాలువ అలైన్‌మెంట్ మారుస్తామని ప్రకటించారు. తోటపల్లి కాలువ పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

Amaravati Capital: అమరావతి పేరు వినపడకూడదనే ప్రజా రాజధానిని ధ్వంసం చేశారని లోకేశ్​ మండిపడ్డారు. ప్రజల త్యాగాలు, దేవతల ఆశీస్సులున్న అమరావతి శాశ్వత నగరమని అన్నారు. చివరికి సినిమాలో రాజధాని పేరు విన్నా ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేరని అన్నారు.

ప్రజా ధనాన్ని సీఎం జగన్​ లూటీ చేస్తున్నారు: నారా లోకేశ్​

ABOUT THE AUTHOR

...view details