ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్లకు కడుతున్న రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు వైభవం - ఎక్కడంటే?

రెడ్డిరాజుల ఘన చరిత్రను భావి తరాలకు తెలిపేలా పల్నాడు జిల్లాలో మ్యూజియం ఏర్పాటు - చారిత్రక ఆనవాళ్లు, శిలా, తామ్ర శాసనాల నమూనాలు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు తదితర వస్తువులు

Heritage Museum on Reddy Kings
Heritage Museum on Reddy Kings (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2025 at 6:01 PM IST

Heritage Museum on Reddy Kings : తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్రను భావి తరాలకు అందించేందుకు అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య - శ్రీశైలం వారు ప్రత్యేక మ్యూజియంను నిర్మించారు. రెడ్డిరాజుల ఘన చరిత్ర, చారిత్రక విశిష్టత, కొండవీడు గత వైభవాన్ని ముందు తరాలని అందించాలనే సంకల్పంతో పల్నాడు జిల్లా కొండవీడు సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్‌ గ్రామంలో రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల (మ్యూజియం) నిర్మించారు.

కొండవీడుకోట నమూనా, చుట్టూ చరిత్రను తెలిపే చిత్రాలు (ETV Bharat)

రెడ్డిరాజులు ఏలిన కొండవీడు, గద్వాల్‌ సంస్థానం, ఉదయగిరి, ఆత్మకూరు, వనపర్తి, దూమకొండ తదితర ప్రదేశాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు, సమాచారాన్ని నిపుణుల కమిటీ సభ్యులు సేకరించి ఇక్కడ ఆకర్షణీయమైన రీతిలో అందుబాటులో ఉంచారు. 24 అడుగుల వెడల్పు, 36 అడుగుల పొడవుతో ఉన్న కొండవీడు కోట నమూనా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఆ కాలం నాటి శిలా, తామ్ర శాసనాల నమూనాలు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు తదితర వస్తువులు నాటి వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి.

భవన ఆవరణలో ఉంచిన అలనాటి శిల్ప కళ (ETV Bharat)